ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  అర్హత కలిగిన పేదలకు మాత్రమే ‘ఇందిరమ్మ ఇళ్లు’ మంజూరు చేయాలి. బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి

అర్హత కలిగిన పేదలకు మాత్రమే ‘ఇందిరమ్మ ఇళ్లు’ మంజూరు చేయాలి.
బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి

పినపాక, ఆధాబ్ న్యూస్:
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అక్రమ మార్గాల్లో అమలు చేస్తూ, అర్హులైన పేదలను పక్కనపెట్టి, ముడుపుల ఆధారంగా ఇళ్లను మంజూరు చేస్తున్నారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని తెలంగాణ జన సమితి పార్టీ పినపాక మండల అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి డిమాండ్ చేశారు.
అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అభ్యర్థుల ఎంపిక
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పినపాక మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం సర్వే చేసినా, ఆ లిస్టును పక్కనబెట్టి అధికార పార్టీ నాయకుల సూచనల మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని తెలిపారు. “ముడుపులు చెల్లిస్తేనే లిస్టులో పేర్లు పెడుతున్నారు. ఇది తీవ్రంగా విచారకరం. అసలు అర్హత కలిగిన పేదవాళ్లను తప్పించటం అన్యాయం,” అని వ్యాఖ్యానించారు.
ఇతరులకు ఇళ్లు, పేదలకు నిరాశ

ఇళ్లు నిజంగా అవసరమైన పేదవాళ్లకు కాకుండా, అధికార పార్టీకి చెందిన వర్గాలకే మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. “ఇలాంటి అక్రమాలను ప్రజలు ఇక భరించరు. ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ జరిపించి, దోషులపై చర్యలు తీసుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం తప్పదు,” అని హెచ్చరించారు.

ఐతే ఇందిరమ్మ ఇల్లు పథకం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది?

ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. “ఆ సమయంలో లక్షలాది పేద కుటుంబాలకు ప్రభుత్వ సహాయంతో ఇళ్లు లభించాయి. ఇంటి నిర్మాణానికి రూ.1,00,000 వరకు మంజూరు చేశారు. కానీ అప్పట్లో కూడా దళారులు బిల్లులు మార్చుకుని లబ్ధిదారుల హక్కులు హరిస్తే, ఇప్పుడు అదే కథ మరోసారి నడుస్తోంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి వినతిపత్రాలు – ప్రజలతో కలిసి ఉద్యమానికి సిద్ధం

ఈ సమస్యపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసి సమస్యను వివరించి, వినతిపత్రాలు అందిస్తామని తెలిపారు. “ప్రజల సమస్యల పరిష్కారం కోసం నేను ఎప్పుడూ ముందుండతాను,” అని బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….