ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  చర్కాపై నూలు వడికిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

చర్కాపై నూలు వడికిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో భాగంగా శనివారం నిర్వహించిన ఎగ్జిబిషన్‌కు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గాంధీ చర్కాను తిప్పుతూ నూలు వడకడం ద్వారా మంత్రి ప్రజల్లో ఆత్మనిర్భరత, స్వదేశీ ఉద్యమాల ప్రాముఖ్యతను జ్ఞప్తి చేశారు. చర్కా ఉపయోగం ద్వారా స్వయం ఉపాధికి మార్గం చూపిన మహాత్మా గాంధీ సిద్ధాంతాలను గుర్తుచేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “స్వదేశీ ఉత్పత్తులు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ప్రతి ఒక్కరూ స్వదేశీని ప్రోత్సహించాలి” అన్నారు.
భారత్ సమ్మిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌లో ఖాదీ వస్త్రాలు, స్వదేశీ ఉత్పత్తులు, చారిత్రక ప్రదర్శనలతో సందర్శకులను ఆకట్టుకున్నాయి. దేశీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై, గాంధీ సిద్ధాంతాలను ఆసక్తిగా పరిశీలించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….