ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  నీరుపేదలకు మాత్రమే డబల్ బెడ్ రూమ్ ఇల్లు అందాలి. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

నీరుపేదలకు మాత్రమే డబల్ బెడ్ రూమ్ ఇల్లు అందాలి. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 29 ఆధాబ్ న్యూస్ :
పేదలలో అత్యంత నిరుపేదలకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు అవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ మరియు జిల్లాలో నెలకొన్న భూ సమస్యలపై ఆర్డీవోలు, జిల్లా అధికారులు మరియు జిల్లాలోని అందరు తాసిల్దారులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కొత్తగూడెం లక్ష్మీదేవి పల్లి, పాల్వంచ, అశ్వరావుపేట, చర్ల మండలాల్లో డేటా ఎంట్రీ పురోగతిపై అసహనం వ్యక్తం చేశారు. కరకగూడెం మరియు చర్ల మండలాలు మారు మూల ప్రాంతాల్లో ఉండటం, విద్యుత్ అంతరాయం, నెట్వర్క్ సమస్య మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు కొరత ఉన్నందువలన బూర్గంపాడు మండలం డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కరకగూడెం మరియు చర్ల మండలం డేటా ఎంట్రీ ప్రక్రియను చేపట్టాలని, భద్రాచలం ఆర్డీవోని పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు.
జిల్లాలో పూర్తి అయిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు లబ్ధిదారులు ఎంపిక కు తాసిల్దారులు అందరూ క్షేత్రస్థాయిలో అన్ని గ్రామాలలో పర్యటించి పేదలలో అత్యంత నిరు పేద వాళ్లకు మాత్రమే లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లలతో జీవనం సాగిస్తున్న ఒంటరి మహిళలు, వితంతువులు, గుడిసెలలో జీవనం సాగిస్తున్న వారిని గుర్తించాలన్నారు. తాసిల్దారులందరూ ఈరోజు తమ పరిధిలోకి వచ్చిన దరఖాస్తులను ప్రత్యక్షంగా తనిఖీ చేసి, పేదవారిని గుర్తించి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. తాసిల్దారులు గుర్తించిన పేదవారిని ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో విచారించి తుది జాబితా సిద్ధం చేయాలని కొత్తగూడెం మరియు భద్రాచలం ఆర్డీవో లను ఆదేశించారు.లబ్ధిదారుల ఎంపికలో అధికారులు మరియు ఉద్యోగస్తులు ఎటువంటి పైరవీలు లేదా అవకతవకలకు పాల్పడిన ఉపేక్షించేది లేదు అని కలెక్టర్ హెచ్చరించారు.
జిల్లాలో ఎవరైనా గిరిజనేతరులకి విభజన పేరుతో పట్టా మార్పు లేదా భూమి అమ్మకానికి అధికారులు సహాయం చేస్తే వారిని సస్పెండ్ చేయడంతో పాటు వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….