ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఎల్‌నినో ఎఫెక్ట్.. పేదలకు ‘అమ్మహస్తం’ తరహా రేషన్? నిత్యావసరాల సబ్సిడీ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్

  డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. ఇద్దరికి రెండు రోజుల జైలు

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. ఇద్దరికి రెండు రోజుల జైలు

కొత్తగూడెం, సెప్టెంబర్‌ 2 (ఆధాబ్‌ న్యూస్‌): మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికి కొత్తగూడెం 2వ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ రవికుమార్‌ రెండు రోజుల జైలు శిక్ష విధించారు.

కొత్తగూడెం ట్రాఫిక్‌ ఎస్‌ఐ గడ్డం ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఇద్దరు పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, విచారణ అనంతరం మేజిస్ట్రేట్‌ రవికుమార్‌ ఇద్దరికీ రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్‌ పోలీసులు మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహనదారులతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని తెలిపారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, రహదారి భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు