ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఎల్‌నినో ఎఫెక్ట్.. పేదలకు ‘అమ్మహస్తం’ తరహా రేషన్? నిత్యావసరాల సబ్సిడీ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్

  ఊకే శిరీష కుటుంబానికి న్యాయం చేయాలి ఆదివాసీ తుడుందెబ్బ, అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో నిరసన.. కొవ్వొత్తుల ర్యాలీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

ఊకే శిరీష కుటుంబానికి న్యాయం చేయాలి

ఆదివాసీ తుడుందెబ్బ, అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో నిరసన.. కొవ్వొత్తుల ర్యాలీ

ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

కరకగూడెం, సెప్టెంబర్ 1 (ఆధాబ్ న్యూస్): ఊకే శిరీష మృతిపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ తుడుందెబ్బ, అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కరకగూడెం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శిరీష మృతికి సంతాపం తెలియజేస్తూ పెద్ద సంఖ్యలో ఆదివాసీ సంఘాల నాయకులు, విద్యార్థులు, యువత, ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ మాట్లాడుతూ.. ఊకే శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ఘటనపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరారు.

బాధిత కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సహాయం, తగిన పరిహారం అందించాలని, కుటుంబంలోని అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లేదా తగిన ఉపాధి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కుటుంబానికి విద్య, వైద్యం, ఇతర సంక్షేమ పథకాలు అందించడంతో పాటు భద్రత, న్యాయ సహాయం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఆదివాసీ మహిళలు, యువతుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. బాధ్యులను గుర్తించిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ నాయకులు డిమాండ్ చేశారు.

కొవ్వొత్తుల ర్యాలీ

శిరీష మృతికి సంతాపం తెలియజేస్తూ నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీ మండల కేంద్రంలో కొనసాగింది. న్యాయం కోసం వివిధ వర్గాలు ఏకతాటిపైకి రావడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. శిరీష కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పోలేబోయిన వెంకటనారాయణ, కలం సాంబమూర్తి, గొగ్గల కృష్ణ, కలం వేణు, పోలేబోయిన రాజు, మలకం నరేష్, ఈసం రఘు, తోలెం రామారావు, పోలేబోయిన కృష్ణ తదితరులతో పాటు సర్పంచులు కొమరం సత్యనారాయణ, కల్తీ విజయ్, వట్టం సందీప్ పాల్గొన్నారు. అలాగే రావుల సోమయ్య, కొమరం రాంబాబు, పాయం నర్సింహారావు, ఊకే రామానాథం, బుడగం రాము, గుడ్ల రంజిత్, బైరిశెట్టి చిరంజీవి, పోగు వెంకటేశ్వర్లు, ఎల్ల రామకృష్ణారెడ్డి, గందర్ల సతీష్, శ్రీను తదితరులు, ఆదివాసీ సంఘాల నాయకులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు