ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఎల్‌నినో ఎఫెక్ట్.. పేదలకు ‘అమ్మహస్తం’ తరహా రేషన్? నిత్యావసరాల సబ్సిడీ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్

  ఏడూళ్ల బయ్యారం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి.. పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి గంజాయి వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఏడూళ్ల బయ్యారం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి.. పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి

గంజాయి వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి

పినపాక ,సెప్టెంబర్ 1 (ఆధాబ్ న్యూస్): ఏడూళ్ల బయ్యారం పోలీస్‌స్టేషన్‌ను మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసుల వివరాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరం స్వీకరించి, వాటిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డీఎస్పీ సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ముఖ్యంగా గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గంజాయి వినియోగం వల్ల కలిగే నష్టాలపై యువతకు అవగాహన కల్పించడంతో పాటు, అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచాలని తెలిపారు.

అదేవిధంగా సీసీటీఎన్‌ఎస్‌ (CCTNS) అప్‌డేషన్‌ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ రవీందర్‌రెడ్డి సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు