గురుకులంలో 5వ తరగతి విద్యార్థినిని కాటు వేసిన పాము
రాయపర్తి, ఆగస్టు 30 (ఆధాబ్ న్యూస్): వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గురుకులంలో ఉంటూ చదువుకుంటున్న 5వ తరగతి విద్యార్థినిని పాము కాటు వేసింది.
పాము కాటుకు గురైన విద్యార్థినిని వెంటనే వర్ధన్నపేట సామాజిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థినికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
గురుకుల ప్రాంగణంలో పాము కాటు ఘటన జరగడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. గురుకుల పరిసరాల్లో పాముల సంచారం లేకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Post Views: 75









