ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఎల్‌నినో ఎఫెక్ట్.. పేదలకు ‘అమ్మహస్తం’ తరహా రేషన్? నిత్యావసరాల సబ్సిడీ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్

  మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలి – గ్రామాల్లో చురుగ్గా పనిచేయాలని వీవోఏలకు ఆదేశాలు

మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలి

– గ్రామాల్లో చురుగ్గా పనిచేయాలని వీవోఏలకు ఆదేశాలు

కరకగూడెం, ఆగస్టు 29 (ఆధాబ్ న్యూస్): మండలంలోని మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వీవోఏలు గ్రామస్థాయిలో చురుగ్గా పనిచేయాలని అధికారులు సూచించారు. శుక్రవారం కరకగూడెంలోని సెర్ప్‌ స్వయం శక్తి మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో వీవోఏల సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండలంలోని అన్ని మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సంఘాలు నిత్యం నిర్ణీత సమయంలో సమావేశాలు నిర్వహించడం, ఆర్థిక లావాదేవీలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రుణాలను సక్రమంగా చెల్లించి తిరిగి కొత్త రుణాలు తీసుకుని నూతన వ్యాపారాలు, జీవనోపాధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అదనపు ఆదాయం పొందాలని సూచించారు. తద్వారా మహిళలతో పాటు వారి కుటుంబాలు ఆర్థికంగా సుస్థిరత సాధించేలా కృషి చేయాలని వీవోఏలకు లక్ష్యాలను నిర్దేశించారు.

సమీక్ష సమావేశంలో ప్రాజెక్టు ప్రాధాన్యత అంశాలైన సంస్థాగత నిర్మాణం, బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, జీవనోపాధులు, ఎంటర్‌ప్రైజెస్‌ ఏర్పాటు, ఆసరా పెన్షన్లు, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్లు, సదరం సర్టిఫికెట్లు, ఓపెన్‌ విద్య, టాస్‌ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు సంస్థాగత నిర్మాణం, మానవ అభివృద్ధి, వయోజన విద్య విభాగాల నుంచి సురేష్‌రెడ్డి, వ్యవసాయం, బ్యాంకు లింకేజీ విభాగం నుంచి సమ్మక్క, ఆసరా పెన్షన్లు, సదరం విభాగం నుంచి నర్మదారెడ్డి సంబంధిత అంశాలపై సమీక్షించారు. ఆయా విభాగాల్లో గ్రామాల్లో మరింత అభివృద్ధి సాధించేలా వీవోఏలు పనిచేయాలని సూచిస్తూ లక్ష్యాలను నిర్దేశించారు.

ఈ సమావేశంలో ఏపీఎం వినోద్‌క్రాంతి, మండల సమాఖ్య అధ్యక్షురాలు సరస్వతి, సీసీ సత్యనారాయణతో పాటు వీవోఏలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు