ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఎల్‌నినో ఎఫెక్ట్.. పేదలకు ‘అమ్మహస్తం’ తరహా రేషన్? నిత్యావసరాల సబ్సిడీ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్

  కిక్కిరిసిన బస్సులు.. ప్రయాణికుల అవస్థలు మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీ.. బస్సుల సంఖ్య పెంచాలని మహిళల డిమాండ్

కిక్కిరిసిన బస్సులు.. ప్రయాణికుల అవస్థలు

మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీ.. బస్సుల సంఖ్య పెంచాలని మహిళల డిమాండ్

కరకగూడెం, ఆగస్టు 29 (ఆధాబ్ న్యూస్): మణుగూరు నుంచి రంగాపురం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు రాకపోకలు సాగించే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో అందుబాటులో ఉన్న బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి.

మణుగూరు నుంచి రంగాపురం మార్గంలో ప్రయాణించే బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్సులో సీట్లు నిండిపోవడంతో పాటు నిలబడేందుకు కూడా స్థలం లేకుండా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. రద్దీ సమయాల్లో బస్సు తలుపుల వద్ద కూడా ప్రయాణికులు ఇరుక్కుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మహాలక్ష్మి పథకం అమలుతో మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని విస్తృతంగా వినియోగించుకుంటున్నారని, అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉందని మహిళలు పేర్కొంటున్నారు. అయితే ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా అదనపు సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో రద్దీ మరింత తీవ్రమవుతోందని చెబుతున్నారు.

ఈ సందర్భంగా టిఆర్ఎస్వీ యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం కారణంగా మహిళలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడినప్పటికీ, ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. మణుగూరు–రంగాపురం మార్గంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను వెంటనే పెంచాలని ఆర్టీసీ అధికారులను కోరారు.

అదేవిధంగా బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రంజిత్ కుమార్ సూచించారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, బస్సులను నడిపేందుకు నైపుణ్యం, అనుభవం, బాధ్యత కలిగిన నాణ్యమైన డ్రైవర్లనే నియమించాలని కోరారు. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటోందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, రోజువారీ పనుల కోసం వెళ్లే మహిళలు ఒకే బస్సుపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు.

కాబట్టి రద్దీ సమయాల్లో అదనపు సర్వీసులు నడిపి, ప్రయాణికులకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించాలని మహిళలు, స్థానిక ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు