హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట
ఆధాబ్ న్యూస్ ,హైదరాబాద్ ఆగస్టు 19, 2026
పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది.
తనపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ తీర్పుతో రేగా కాంతారావుకు ఊరట లభించగా, ఆయన అనుచరులు, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
Post Views: 52








