అ ఆ లు రాని వాడు కూడా ఆర్ఎంపీ డాక్టర్ అవతారం..!
వాజేడు,ఆధాబ్ న్యూస్ ఆగస్టు 14:
అ ఆ లు రాని వాడు కూడా ఆర్ఎంపీ డాక్టర్ అవతారం ఎత్తి వైద్యం చేస్తున్నాడని కిష్టాపురం గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం కిష్టాపురంలో జాడి చలపతిరావు అనే వ్యక్తి అనధికారికంగా వైద్యం చేస్తూ యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఇష్టారాజ్యంగా ఇస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. బిల్లులు లేకుండా పెద్ద మొత్తంలో మందుల నిల్వ ఉంచినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Post Views: 93









