ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి వరద ప్రవాహాలు, చెరువులు, వాగులు, కుంటలకు దూరంగా ఉండాలని సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ సూచన

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

వరద ప్రవాహాలు, చెరువులు, వాగులు, కుంటలకు దూరంగా ఉండాలని సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ సూచన

కరకగూడెం,ఆధాబ్ న్యూస్ జూలై 30: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో కరకగూడెం మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.

అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, చెరువులు, కుంటలు, వాగులు, కాలువలు, వరద ప్రవాహ ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని సూచించారు. రైతులు పొలాల్లో పనులు నిర్వహించే సమయంలో విద్యుత్ తీగలు, నీటి ప్రవాహాలు, ప్రమాదకర ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే విద్యార్థులు వర్షాల సమయంలో బయట సంచరించకుండా తల్లిదండ్రుల సూచనలు పాటించాలని తెలిపారు.

ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదం జరిగినా వెంటనే 9347149313 నంబర్‌కు సమాచారం అందించాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాల కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….