ప్రతి క్షణం
ప్రజల పక్షం

అమరవీరుల త్యాగాలే పోలీస్ శాఖకు స్ఫూర్తి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఘన నివాళులు అర్పించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఎల్‌నినో ఎఫెక్ట్.. పేదలకు ‘అమ్మహస్తం’ తరహా రేషన్? నిత్యావసరాల సబ్సిడీ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో

  పెద్ద అంబర్‌పేటలో నకిలీ డీఏపీ తయారీ ముఠా గుట్టురట్టు

పెద్ద అంబర్‌పేటలో నకిలీ డీఏపీ తయారీ ముఠా గుట్టురట్టు

రూ.1.50 కోట్ల విలువైన 1,000 నకిలీ డీఏపీ బస్తాల స్వాధీనం – నిందితులు పరారీ

ఆధాబ్ న్యూస్, హైదరాబాద్, జూలై 19: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు నేతృత్వంలో పోలీసులు చేపట్టిన దాడుల్లో పెద్ద అంబర్‌పేటలో నిర్వహిస్తున్న భారీ నకిలీ డీఏపీ ఎరువుల తయారీ ముఠా గుట్టురట్టైంది. దాడుల్లో సుమారు రూ.1.50 కోట్ల విలువైన 1,000 నకిలీ డీఏపీ ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ రైతు నకిలీ డీఏపీ కొనుగోలు చేసిన ఘటనపై మఠంపల్లి మండలంలో నమోదైన కేసు దర్యాప్తులో కీలక ఆధారాలు లభించాయి. ఆ సమాచారంతో పోలీసులు దర్యాప్తును విస్తరించి పెద్ద అంబర్‌పేటలోని గోదాముపై మెరుపు దాడి నిర్వహించారు.

తనిఖీల్లో సాల్ట్, గ్రోమోర్, కోరమండల్, అన్నపూర్ణ తదితర ప్రముఖ కంపెనీల పేర్లతో ఉన్న ఖాళీ సంచుల్లో ఉప్పు, మట్టి తదితర నాసిరకం పదార్థాలను రసాయనాలతో కలిపి డీఏపీ ఎరువులుగా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ ఎరువుల తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాలు, ప్యాకింగ్ సామగ్రితో పాటు 1,000 బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, నాణ్యతపై అనుమానం ఉంటే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు