ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  అల్లేరుగూడెంలో సార్లమ్మ గుడి కూల్చివేత ఘటనపై తుడుం దెబ్బ ఆగ్రహం

అల్లేరుగూడెంలో సార్లమ్మ గుడి కూల్చివేత ఘటనపై తుడుం దెబ్బ ఆగ్రహం

కరకగూడెం, ఆధాబ్ న్యూస్ జూన్ 16: కరకగూడెం మండలంలోని అల్లేరుగూడెం గ్రామంలో ఫారెస్ట్ అధికారులు సార్లమ్మ గుడి నిర్మాణాన్ని కూల్చివేసిన ఘటనను తుడుం దెబ్బ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై తుడుం దెబ్బ జిల్లా కార్యదర్శి పోలెబోయిన వెంకటనారాయణ గ్రామస్తులతో కలిసి గుడి ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదవ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల ఆచారాలు, సంప్రదాయాలు, ఆరాధనా స్థలాలకు ప్రత్యేక రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నారు. పూర్వీకుల కాలం నుంచి కొనసాగుతున్న సార్లమ్మ దేవత స్థలాన్ని గ్రామ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, గ్రామస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం బాధాకరమైన, ఖండనీయమైన చర్య అని పేర్కొన్నారు.

ఆదివాసీల విశ్వాసాలు, సంస్కృతి, సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించిన సంబంధిత అధికారుల తీరును తుడుం దెబ్బ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఐదవ షెడ్యూల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఆదివాసీ హక్కులను కాలరాసే విధంగా వ్యవహరించిన అధికారులపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే సార్లమ్మ గుడి నిర్మాణాన్ని పునరుద్ధరించి, భవిష్యత్తులో ఆదివాసీ ఆరాధనా స్థలాలపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆదివాసీల ఆరాధనా స్థలాలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం తుడుం దెబ్బ నిరంతరం పోరాడుతుందని, ఆదివాసీల మనోభావాలను దెబ్బతీసే ఏ చర్యనైనా సహించబోమని వెంకటనారాయణ స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….