ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఆకస్మిక తనిఖీలు చేపట్టిన సివిల్ సప్లై డిటి శివకుమార్

ఆకస్మిక తనిఖీలు చేపట్టిన సివిల్ సప్లై డిటి శివకుమార్

మణుగూరు, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో సివిల్ సప్లై డిటి శివకుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండలంలోని రామంజవరం మరియు మణుగూరు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అక్కడి సిబ్బందికి సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.

అనంతరం మణుగూరు పట్టణంలోని పలు హోటళ్లు, టిఫిన్ బండ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న ఆరు గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల స్థానంలో గృహ వినియోగ నార్మల్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వంట గ్యాస్ సిలిండర్లను వ్యాపారాల కోసం దుర్వినియోగం చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని సివిల్ సప్లై డిటి శివకుమార్ స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్