ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కీలక నిర్ణయాలు.. ఉచిత విద్యుత్, డ్రగ్స్ నిరోధక టీమ్‌కు సీఎం విజయ్ గ్రీన్ సిగ్నల్

సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కీలక నిర్ణయాలు.. ఉచిత విద్యుత్, డ్రగ్స్ నిరోధక టీమ్‌కు సీఎం విజయ్ గ్రీన్ సిగ్నల్

చెన్నై, మే 10 (ఆధాబ్ న్యూస్):
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి Vijay కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. ప్రజా సంక్షేమం, మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తూ తొలి నిర్ణయాలు తీసుకున్నారు.

ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకం ప్రకారం రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. దీంతో సామాన్య ప్రజలకు ఊరట లభించనుంది.

అదేవిధంగా రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేస్తూ మరో కీలక ఫైల్‌పై సంతకం చేశారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు నిర్ణయాన్ని కూడా సీఎం ఆమోదించారు. మహిళలపై వేధింపులు, నేరాలను అరికట్టేందుకు ఈ బృందాలు పనిచేయనున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్