ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తమిళనాడులో టీవీకే సంచలనం – సెంచరీ దాటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ పార్టీ

తమిళనాడులో టీవీకే సంచలనం – సెంచరీ దాటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ పార్టీ
తమిళనాడు,ఆధాబ్ న్యూస్:
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కజగం (TVK) పార్టీ అసెంబ్లీ ఫలితాల్లో ఘన విజయం సాధించింది. మొత్తం 101 స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.

ఇక అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కళగం (DMK) 73 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ప్రతిపక్షంగా ఉన్న అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (AIADMK) 50 స్థానాలు గెలుచుకుంది.

కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన టీవీకే పార్టీ ఈ స్థాయిలో విజయం సాధించడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రజల్లో మార్పు కోరిక స్పష్టంగా కనిపించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సీట్ల వివరాలు:

TVK – 101

DMK – 73

AIADMK – 50

ఈ ఫలితాలతో తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలు ఎలా రూపుదిద్దుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్