పినపాకలో రోడ్డు ప్రమాదం.. కారు-లారీ ఢీ
పినపాక,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని గొట్టెల్ల సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు–లారీ బలంగా ఢీకొన్నాయి. మణుగూరు నుంచి ఎటూరునాగారం వైపు వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను సర్దుబాటు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Post Views: 20









