మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు అన్ని సంస్థల్లో ICC తప్పనిసర. జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013 ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, పరిశ్రమలు తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదు కమిటీలు (ICC) ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని సంస్థలు ICC ఏర్పాటు చేసి, కమిటీ వివరాలను She Box Portal (shebox.wcd.gov.in)లో నమోదు చేయాలని సూచించారు.
ICC ఏర్పాటు చేయని లేదా వివరాలు నమోదు చేయని సంస్థలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Post Views: 44









