ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కేసీఆర్‌కు సిట్ నోటీసుపై కరకగూడెంలో బీఆర్‌ఎస్ నిరసన

కేసీఆర్‌కు సిట్ నోటీసుపై కరకగూడెంలో బీఆర్‌ఎస్ నిరసన

కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసు ఇవ్వడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.

మండల బీఆర్‌ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు పోగు వెంకటేశ్వర్లు, సోషల్ మీడియా అధ్యక్షుడు సిద్ధి సునిల్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ కార్యాలయం ఎదుట  నిరసన తెలిపారు. అనంతరం రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆరు గ్యారెంటీలు, వందల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే రాజకీయ కక్షతో సిట్ పేరిట బీఆర్‌ఎస్ నాయకులను వేధిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించలేకే ఈ ప్రభుత్వం డ్రామాలకు తెరలేపిందన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వ మురికి రాజకీయాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు కొమరం సత్యనారాయణ, వట్టం సందీప్, ఉపసర్పంచ్ బుడగం రాము, ఊకె రామనాధం, పోలేబోయిన నర్సింహారావు, పాయం నర్సింహారావు, ఎల్లు రామకృష్ణ రెడ్డి, గుమ్మడివెల్లి ప్రసాద్, కట్టుకోజ్వల వేణు, రావుల కనకయ్య, చందా వసంతరావు, గొగ్గలి శ్రీను, యల్లగొండ శ్రీను, దాసరి సాంబయ్య, అజ్జు, నాలి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!