ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భట్టుపల్లి పెద్దమ్మతల్లి ఆలయం వద్ద క్లీన్ & గ్రీన్ కార్యక్రమం సర్పంచ్ తోలెం రమాదేవి ఆధ్వర్యంలో పరిశుభ్రత చర్యలు

భట్టుపల్లి పెద్దమ్మతల్లి ఆలయం వద్ద క్లీన్ & గ్రీన్ కార్యక్రమం
సర్పంచ్ తోలెం రమాదేవి ఆధ్వర్యంలో పరిశుభ్రత చర్యలు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం భట్టుపల్లి పంచాయతీ పరిధిలోని రాళ్లవాగు వద్ద కొలువై ఉన్న శ్రీ పెద్దమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో క్లీన్ & గ్రీన్ కార్యక్రమాన్ని సర్పంచ్ తోలెం రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు.

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చి వెళ్లే భక్తులు పెద్దమ్మతల్లి ఆలయం వద్ద విశ్రాంతి తీసుకునే సమయంలో ఆలయ ప్రాంగణంలో చెత్త చెదారం పేరుకుపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విషయం తెలుసుకున్న సర్పంచ్ వెంటనే స్పందించారు. పంచాయతీ సిబ్బందితో కలిసి ఆలయానికి చేరుకుని, ఆలయం చుట్టుపక్కల ఉన్న చెత్తను స్వయంగా పర్యవేక్షిస్తూ శుభ్రం చేయించారు.

భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఇర్రి వెంకన్న, మాజీ సర్పంచ్ తోలెం నాగేశ్వరావుతో పాటు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!