ప్రతి క్షణం
ప్రజల పక్షం

  దివ్యాంగులకు సహాయ ఉపకరణాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల ఆహ్వానం స్వర్ణలత లెనిన ప్రకటన

దివ్యాంగులకు సహాయ ఉపకరణాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల ఆహ్వానం
స్వర్ణలత లెనిన ప్రకటన
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దివ్యాంగుల కోసం వివిధ రకాల సహాయ ఉపకరణాల పంపిణీకి సంబంధించి అర్హులైనవారి నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనిన పత్రికా ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రిట్రో ఫిట్టేడ్ మోటార్ వాహనాలు 51, బ్యాటరీ వీల్ చైర్లు 15, మొబైల్ బిజినెస్ బ్యాటరీ వీల్ చైర్లు 20, బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో 1, హైబ్రిడ్ వీల్ చైర్లు 5, లాప్టాప్స్ 23, టాబ్లెట్లు 13, 5జీ స్మార్ట్‌ఫోన్లు 3, ట్రై సైకిల్ వీల్ చైర్లు మరియు వినికిడి యంత్రాలు వంటి ఉపకరణాలను అందించనున్నారు.

దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు https://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈనెల 18లోగా దరఖాస్తు చేయవలసిందిగా సూచించారు. దరఖాస్తు చేసిన తరువాత సంబంధిత పత్రాలను మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం, IDOC, గ్రౌండ్ ఫ్లోర్-1 లో సమర్పించాలి.

అంతేకాక, మరిన్ని వివరాల కోసం 63019 81960 లేదా 83310 06010 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!