ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గోదావరిలో దూకి పాస్టర్ ఆత్మహత్య

గోదావరిలో దూకి పాస్టర్ ఆత్మహత్య

మణుగూరు,ఆధాబ్ న్యూస్: మణుగూరు మండల పరిధిలోని మల్లేపల్లి వద్ద గోదావరిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉద్రిక్తత కలిగించింది. మృతుడిని మైపా యోసేపుగా (వయసు 40) గుర్తించారు.
పినపాక మండలానికి చెందిన తోగూడెం గ్రామంలో నివాసముంటున్న యోసేపు, అక్కడ గల గ్రేస్ మిషన్ పాఠశాలకు అనుబంధంగా ఉన్న చర్చిలో పాస్టర్‌గా సేవలు అందిస్తున్నాడు. అంతేగాక, అదే గ్రామంలో జీఎస్‌ఎస్‌ క్రైస్తవ సంస్థ ఏర్పాటు చేసిన డేకర్ సెంటర్‌కు ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేస్తున్నాడు.
మల్లేపల్లి వద్ద గోదావరిలో దూకిన యోసేపును స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. కొన్ని గంటల అనంతరం అతని మృతదేహాన్ని వెలికితీశారు.

ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబంలో భార్య మేరీ, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్