ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ట్రాక్టర్ టైరు పేలుడు ప్రమాదం – కరకగూడెం మండలంలో సతీష్‌కు తీవ్ర గాయాలు

ట్రాక్టర్ టైరు పేలుడు ప్రమాదం – కరగూడెం మండలంలో సతీష్‌కు తీవ్ర గాయాలు.                       కరకగూడెం,ఆధాబ్ న్యూస్:

కరగూడెం మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ టైరు గాలి నింపుతుండగా అకస్మాత్తుగా పేలిపోవడంతో నిర్వహణ చేస్తున్న సతీష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేయి విరిగినట్లూ, తలకు తీవ్రమైన గాయాలు వచ్చినట్లూ సమాచారం.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అనంతరం గాయపడిన సతీష్‌ను అత్యవసర చికిత్స కోసం మణుగూరుకు తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!