ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల ఫలితాల్లో మెరిసిన ఆదివాసి ముత్యం

ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల ఫలితాల్లో మెరిసిన ఆదివాసి ముత్యం
ప్రధమ స్థానం సాధించిన అభిఘ్నశ్రీ

కరకగూడెం, ఆధాబ్ న్యూస్:ఆదివాసి విద్యారంగంలో మరోసారి ప్రతిభ చాటుతూ తాటిగూడెం గ్రామానికి చెందిన పోలెబోయిన అభిఘ్నశ్రీ పాఠశాల పేరు గర్వించదగ్గ విధంగా మారింది. దమ్మపేట మండలంలోని గండుగులపల్లి లో ఉన్న ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి ఫలితాలలో స్కూల్ టాప్ ర్యాంక్ సాధించిన అభిఘ్నశ్రీ, తన ప్రతిభను మరోసారి రుజువు చేసింది.
ఆమె తల్లిదండ్రులు పోలెబోయిన వెంకటనారాయణ మరియు నాగరాణి తమ కుమార్తె ఘనతపై గర్వంతో స్పందించారు. కరకగూడెం మండల ఆదివాసి జె ఎ సి అధ్యక్షులుగా ఉన్న ఈ కుటుంబం, ఆదివాసి విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తోంది.

అభిఘ్నశ్రీ సాధించిన ఈ విజయం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు కూడా కృషి చేస్తే ఎంతటి ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చో మనకు స్పష్టం చేస్తోంది. ఆమె భవిష్యత్తుకు విజయాలు కాంక్షిస్తూ గ్రామస్తులు, పాఠశాల అధ్యాపకులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!