ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాయం .

అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాయం .

మణుగూరు , ఆధాబ్ న్యూస్
మణుగూరులోని అంబేద్కర్ సెంటర్ సమీపంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా, క్షత్రియ సేవ సమితి ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం, ఇటీవల కాశ్మీర్ పహాల్గంలో ఉగ్రవాది దాడిలో మృతి చెందిన భారతీయుల కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, “అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి శౌర్య ప్రతాపాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి,” అని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో శివాజీ తరువాత అంతటి పోరాట పటిమను చూపిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన చరిత రానున్న తరాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోల్లోజు అయోధ్య, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరినకి నవీన్, సిపిఐ, సిపిఎం, టిడిపి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, క్షత్రియ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు క్షత్రియ సేవా సమితి సభ్యులు ఘన స్వాగతం పలికారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….