నూతన ఎస్‌ఐ రఘుకు ఉపసర్పంచ్‌ల సంఘం ఘన సత్కారం
పినపాక, అక్టోబర్ 29 (ఆధాబ్ న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన రఘును పినపాక మండల ఉపసర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రఘుకు శాలువా కప్పి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపసర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు అచ్చా నవీన్, పినపాక మండల ఉపసర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు దాట్ల రాజేష్‌తో పాటు సంఘం ముఖ్య ప్రతినిధులు, నాయకులు పాల్గొని నూతన ఎస్‌ఐకి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. ఆధునిక సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు శిక్షలతో పాటు ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించే ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానం ఎంతో అవసరమని అన్నారు. పినపాక మండలంలో నేర రహిత సమాజ నిర్మాణానికి, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు ప్రజాప్రతినిధుల తరఫున సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
అసాంఘిక శక్తుల నిర్మూలనతో పాటు గ్రామాల్లో సామరస్య వాతావరణాన్ని కొనసాగించేందుకు పోలీస్ శాఖతో కలిసి ప్రజాప్రతినిధులు కూడా కృషి చేస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ల సంఘం ఉపాధ్యక్షులు గంగిరెడ్డి సందీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొడం రామ్మోహన్, సహాయ కార్యదర్శులు ఆరె స్రవంతి, నిట్టా శిరీష, కాంగ్రెస్ నాయకులు ఆరె నవీన్, ఉప్పాక సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.








