ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పాఠశాల ఆవరణలో రెండు ఎండిన చెట్లు.. విద్యార్థుల భద్రతపై ఆందోళన

పాఠశాల ఆవరణలో రెండు ఎండిన చెట్లు.. విద్యార్థుల భద్రతపై ఆందోళన

ఆధాబ్ న్యూస్ ,కరకగూడెం అక్టోబర్ 29:
కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక మోడల్ పాఠశాల ఆవరణలో రెండు భారీ చెట్లు పూర్తిగా ఎండిపోయి ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొనడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.

ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో పాటు గాలి దుమ్ములు వీస్తుండటంతో ఎండిన చెట్లు కూలి పాఠశాల భవనంపై లేదా విద్యార్థులపై పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా ఉన్న రెండు ఎండిన చెట్లను తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

oplus_131072

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు