ప్రతి క్షణం
ప్రజల పక్షం

పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి కరకగూడెం, ఏడుళ్ల బయ్యారం, మణుగూరు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అమరవీరుల త్యాగాలే పోలీస్ శాఖకు స్ఫూర్తి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఘన నివాళులు అర్పించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఎల్‌నినో ఎఫెక్ట్.. పేదలకు ‘అమ్మహస్తం’ తరహా రేషన్? నిత్యావసరాల సబ్సిడీ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్

  పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి కరకగూడెం, ఏడుళ్ల బయ్యారం, మణుగూరు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి

కరకగూడెం, ఏడుళ్ల బయ్యారం, మణుగూరు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

ఆధాబ్ న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కరకగూడెం, ఏడుళ్ల బయ్యారం, మణుగూరు పోలీస్ స్టేషన్లను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. కరకగూడెం పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన వార్షిక తనిఖీలో డీఎస్పీ రవీందర్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ సిబ్బంది నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు.

వార్షిక తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, కార్యాలయ నిర్వహణ, కేసు రికార్డులు, స్టేషన్ ప్రాపర్టీ, ఆయుధాల నిర్వహణ, సిబ్బంది విధులు, కిట్ ఆర్టికల్స్‌ను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. విధి నిర్వహణకు అవసరమైన కిట్ ఆర్టికల్స్‌ను సక్రమంగా నిర్వహించుకోవాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ దర్యాప్తుల పురోగతి, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పోలీస్ స్టేషన్‌కు వివిధ సమస్యలతో వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలపై తక్షణమే స్పందించి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఎస్పీ సూచించారు. పోలీస్ స్టేషన్‌లోని ఆయుధాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ సక్రమంగా నిర్వహించాలని, స్టేషన్ ప్రాపర్టీకి సంబంధించిన రికార్డులను క్రమబద్ధంగా నిర్వహిస్తూ వాటి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విధుల నిర్వహణలో క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పనితీరును కనబరచాలని సూచించారు.

సీసీటీఎన్‌ఎస్‌ 2.0లో కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతికి సంబంధించిన సమాచారాన్ని సకాలంలో నమోదు చేయాలని, ప్రతి ఒక్కరూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా గ్రామాల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

జూదం, కోడిపందాలు, పేకాట, బెట్టింగ్, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిస్థాయిలో అరికట్టాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

అనంతరం ఏడుళ్ల బయ్యారం, మణుగూరు పోలీస్ స్టేషన్లను ఎస్పీ సందర్శించి అక్కడ నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ సిబ్బందికి మెరుగైన పని వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పోలీస్ స్టేషన్లలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, సీఐ నాగబాబు, ఎస్సై పి.వి.ఎన్. రావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు