ప్రజలకు సేవ చేయడమే సతీష్ రెడ్డి లక్ష్యం
యువనేత పగడాల సతీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా రోగులకు పండ్లు, రొట్టెల పంపిణీ
కరకగూడెం, సెప్టెంబర్ 3 (ఆధాబ్ న్యూస్): బీఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు, యువనేత పగడాల సతీష్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు గుడ్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఇందులో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. రోగులకు సేవా కార్యక్రమం నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా గుడ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. పగడాల సతీష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ, కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండే ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు. పినపాక మండలంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నారని తెలిపారు.
అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు సతీష్ రెడ్డి నమ్మినబంటుగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో పార్టీ కార్యకర్తలకు మరింత ప్రోత్సాహం లభిస్తోందని, ఆయన సూచనలు, సహకారంతో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నామని తెలిపారు. సతీష్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
అనంతరం మండల పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తల సమక్షంలో సతీష్ రెడ్డి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రావుల సోమయ్య, బుడగం రాము, బైరిశెట్టి చిరంజీవి, వట్టం వెంకటేశ్వర్లు, యువజన విభాగం నాయకులు పోలెబోయిన దిలీప్, బందు సతీష్, రాము, సాంబయ్య, నరేష్, నారాయణ, సయ్యద్ పాషా, తోలెం రామారావు, పడిగ అశోక్‌తో పాటు పలువురు యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









