పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్.. దరఖాస్తులకు ఆహ్వానం
కరకగూడెం, సెప్టెంబర్ 3 (ఆధాబ్ న్యూస్): పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న కరకగూడెం మండలంలోని చదువుకున్న యువతీ యువకులకు పోలీసులు శుభవార్త తెలిపారు. ఉద్యోగ సాధనకు అవసరమైన శిక్షణ అందించేందుకు ఉచిత కోచింగ్ నిర్వహించనున్నట్లు కరకగూడెం ఎస్‌ఐ పి.వి.ఎన్. రావు తెలిపారు.
మండలంలోని పోలీస్ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న ఆసక్తిగల యువతీ యువకులు తమ పూర్తి వివరాలతో కరకగూడెం పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని ఎస్‌ఐ సూచించారు. ఈ ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకుని పోలీస్ ఉద్యోగ సాధన దిశగా ముందుకు సాగాలని కోరారు.
ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులు ఒక్కరోజు మాత్రమే స్వీకరించబడతాయని ఎస్‌ఐ తెలిపారు. ఈ సమాచారాన్ని స్థానిక వాట్సాప్, సోషల్ మీడియా గ్రూపుల్లో విస్తృతంగా షేర్ చేసి, అర్హత ఉన్న యువతకు సమాచారం చేరేలా సహకరించాలని కోరారు.
— పి.వి.ఎన్. రావు, ఎస్‌ఐ, కరకగూడెం









