డ్రంక్ అండ్ డ్రైవ్.. ఇద్దరికి రెండు రోజుల జైలు
కొత్తగూడెం, సెప్టెంబర్ 2 (ఆధాబ్ న్యూస్): మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికి కొత్తగూడెం 2వ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ రవికుమార్ రెండు రోజుల జైలు శిక్ష విధించారు.
కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఇద్దరు పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, విచారణ అనంతరం మేజిస్ట్రేట్ రవికుమార్ ఇద్దరికీ రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహనదారులతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, రహదారి భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.









