ఏడూళ్ల బయ్యారం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి.. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి
గంజాయి వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి
పినపాక ,సెప్టెంబర్ 1 (ఆధాబ్ న్యూస్): ఏడూళ్ల బయ్యారం పోలీస్‌స్టేషన్‌ను మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసుల వివరాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరం స్వీకరించి, వాటిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డీఎస్పీ సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ముఖ్యంగా గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గంజాయి వినియోగం వల్ల కలిగే నష్టాలపై యువతకు అవగాహన కల్పించడంతో పాటు, అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచాలని తెలిపారు.
అదేవిధంగా సీసీటీఎన్ఎస్ (CCTNS) అప్డేషన్ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ రవీందర్‌రెడ్డి సూచించారు.









