ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఎల్‌నినో ఎఫెక్ట్.. పేదలకు ‘అమ్మహస్తం’ తరహా రేషన్? నిత్యావసరాల సబ్సిడీ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్

  రైస్ మిల్లులో 6,300 క్వింటాళ్ల బియ్యం మాయం! ఎన్ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీల్లో భారీగా తేడా.. పోలీసులకు ఫిర్యాదు మిల్లు నిర్వాహకులపై కేసు నమోదు.. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

రైస్ మిల్లులో 6,300 క్వింటాళ్ల బియ్యం మాయం!

ఎన్ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీల్లో భారీగా తేడా.. పోలీసులకు ఫిర్యాదు

మిల్లు నిర్వాహకులపై కేసు నమోదు.. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

అశ్వాపురం, సెప్టెంబర్ 1 (ఆధాబ్ న్యూస్): అశ్వాపురం మండలంలోని ఓ రైస్ మిల్లులో భారీగా బియ్యం తేడా బయటపడింది. గత నెల 5వ తేదీన ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 6,300 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.

మిల్లులోని బియ్యం నిల్వలు, రికార్డులను అధికారులు పరిశీలించగా లెక్కల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారంపై ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మిల్లు నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మిల్లు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఎల్లయ్య తెలిపారు.

భారీ మొత్తంలో బియ్యం నిల్వల్లో తేడా రావడంపై అధికారులు, పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు