ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఎల్‌నినో ఎఫెక్ట్.. పేదలకు ‘అమ్మహస్తం’ తరహా రేషన్? నిత్యావసరాల సబ్సిడీ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్

  గురుకులంలో 5వ తరగతి విద్యార్థినిని కాటు వేసిన పాము

గురుకులంలో 5వ తరగతి విద్యార్థినిని కాటు వేసిన పాము

రాయపర్తి, ఆగస్టు 30 (ఆధాబ్ న్యూస్): వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గురుకులంలో ఉంటూ చదువుకుంటున్న 5వ తరగతి విద్యార్థినిని పాము కాటు వేసింది.

పాము కాటుకు గురైన విద్యార్థినిని వెంటనే వర్ధన్నపేట సామాజిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థినికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

గురుకుల ప్రాంగణంలో పాము కాటు ఘటన జరగడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. గురుకుల పరిసరాల్లో పాముల సంచారం లేకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు