ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఎల్‌నినో ఎఫెక్ట్.. పేదలకు ‘అమ్మహస్తం’ తరహా రేషన్? నిత్యావసరాల సబ్సిడీ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్

  హిమాన్షుకు రాఖీ కట్టిన ఇవాంక

హిమాన్షుకు రాఖీ కట్టిన ఇవాంక

హైదరాబాద్, ఆగస్టు 28 (ఆధాబ్ న్యూస్): రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ వేడుకను ఇవాంక ఘనంగా జరుపుకున్నారు. అశ్వారావుపేట యువజన విభాగం మాజీ నియోజకవర్గ అధ్యక్షుడు మోటూరు మోహన్ కుమార్తె ఇవాంక, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనవడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు రావుకు రాఖీ కట్టారు.

ఈ సందర్భంగా ఇవాంక హిమాన్షు రావుకు రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హిమాన్షు కూడా ఇవాంకకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆమెకు ఆశీస్సులు అందించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఆత్మీయ వాతావరణంలో ఆనందంగా సాగింది.

అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర నమ్మకానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ సందర్భంగా జరిగిన ఈ రాఖీ వేడుక కుటుంబ సభ్యుల్లో సంతోషాన్ని నింపింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు