ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఎల్‌నినో ఎఫెక్ట్.. పేదలకు ‘అమ్మహస్తం’ తరహా రేషన్? నిత్యావసరాల సబ్సిడీ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్

  అధిక వడ్డీలు, ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు

అధిక వడ్డీలు, ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 27 (ఆధాబ్ న్యూస్): అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని, ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసే వారిని ఉపేక్షించేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ హెచ్చరించారు.

ప్రజల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి, అనంతరం అధిక మొత్తాలను వసూలు చేస్తూ వేధింపులకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో ప్రజలను బెదిరించడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు.

ప్రజలు ఆర్థిక అవసరాల కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. రుణం తీసుకునే ముందు వడ్డీ, తిరిగి చెల్లింపు విధానం తదితర వివరాలను పూర్తిగా తెలుసుకోవాలని తెలిపారు.

అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువతను ప్రలోభపెట్టి డబ్బులు వసూలు చేసే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులకు ముందస్తుగా ఎలాంటి డబ్బులు చెల్లించవద్దని, ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను సంబంధిత సంస్థల అధికారిక మార్గాల ద్వారా నిర్ధారించుకోవాలని కోరారు.

ఉద్యోగాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాల పేరుతో వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా ప్రకటనలను నమ్మవద్దని తెలిపారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.

అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను వేధించే వారు, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న వ్యక్తుల గురించి సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసు అధికారులకు తెలియజేయాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు