ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఎల్‌నినో ఎఫెక్ట్.. పేదలకు ‘అమ్మహస్తం’ తరహా రేషన్? నిత్యావసరాల సబ్సిడీ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్

  దివ్యాంగ బాల బాలికలకు మండల స్థాయి క్రీడా పోటీలు

దివ్యాంగ బాల బాలికలకు మండల స్థాయి క్రీడా పోటీలు

కరకగూడెం, ఆగస్టు 27 (ఆధాబ్ న్యూస్): కరకగూడెం మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ భవిత పాఠశాలలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న దివ్యాంగ బాల బాలికలకు మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయురాలు ఐఈఆర్టీ జి. విజయకుమారి ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు నిర్వహించారు.

oplus_32

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఈఓ గడ్డం. మంజుల హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగ బాల బాలికలు చదువుతో పాటు క్రీడలు, ఇతర అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. వారికి ప్రోత్సాహం అందిస్తే మరింత ప్రతిభను కనబరుస్తారని తెలిపారు.

కరకగూడెం పోలేబోయిన సర్పంచ్ సుజాత కార్యక్రమానికి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. దివ్యాంగ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు కుర్చీ ఆట, పరుగు పందెం, స్పూన్ రేస్ తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. వివిధ క్రీడా విభాగాల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు.

కార్యక్రమంలో భట్టుపల్లి పాఠశాల హెడ్‌మాస్టర్ మోహన్‌బాబు, కరకగూడెం ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టర్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, సిఆర్పి సాంబశివరావు ప్రత్యేక విద్యా సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు