పోలీస్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్.. యువత సద్వినియోగం చేసుకోవాలి
కరకగూడెం, ఆగస్టు 26 (ఆధాబ్ న్యూస్): పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న కరకగూడెం మండలంలోని చదువుకున్న యువతీ యువకులకు పోలీసులు ఉచిత కోచింగ్ అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కరకగూడెం పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని ఎస్సై పి.వి.ఎన్. రావు తెలిపారు.
పోలీస్ ఉద్యోగాల సాధనకు ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 30, 2026 కాగా, పరీక్షను సెప్టెంబర్ 6, 2026న నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 8712682103 నంబర్‌కు సంప్రదించవచ్చని ఎస్సై తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోలీస్ ఉద్యోగాల సాధనకు కృషి చేయాలని కోరారు.
Post Views: 25








