ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  రేగా కాంతారావును వెంటనే అరెస్టు చేయాలి

 

రేగా కాంతారావును వెంటనే అరెస్టు చేయాలి

మహిళను లైంగికంగా వేధించడం అత్యంత సిగ్గుచేటు

మహిళల గౌరవాన్ని కించపరిచే వారిని సహించం

చట్టప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి

మండల మహిళా కాంగ్రెస్ నాయకులు, సర్పంచుల డిమాండ్

కరకగూడెం, ఆగస్టు 3 (ఆధాబ్ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మండల మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల మహిళా కాంగ్రెస్ నాయకులు, మహిళా సర్పంచులు, మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుపై నమోదైన కేసుపై స్పందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో రేగా కాంతారావుపై బీఎన్‌ఎస్ సెక్షన్ 69, 351(2) కింద కేసు నమోదు కావడం ఆందోళనకరమైన విషయమన్నారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన కేసును నిష్పాక్షికంగా, పూర్తిస్థాయిలో విచారించి చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తిపై ఇటువంటి ఆరోపణలు రావడం బాధాకరమని, మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న నాయకులు మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సమాజానికి మంచి సంకేతం కాదని పేర్కొన్నారు. మహిళల భద్రత గురించి మాట్లాడే నైతిక హక్కు ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి లేదని విమర్శించారు.

మహిళల ఓట్లతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన నాయకులు మహిళల గౌరవాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేదా జోక్యాలకు తావులేకుండా కేసును పారదర్శకంగా విచారించి బాధిత మహిళకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను కోరారు.

మహిళల గౌరవాన్ని కించపరిచే వారిని మహిళా సమాజం ఎన్నటికీ సహించదని, భవిష్యత్తులో ఇలాంటి నాయకులకు మహిళలే ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నైతిక బాధ్యత వహించి రేగా కాంతారావును పార్టీ పదవుల నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో మండల మహిళా మాజీ అధ్యక్షురాలు చందా రత్నమ్మ, కరకగూడెం సర్పంచ్ పోలేబోయిన సుజాత, చిరుమల్ల సర్పంచ్ కొమరం సుగుణ, గొల్లగూడెం సర్పంచ్ ఎల్లబోయిన ముత్తమ్మ, చొప్పాల సర్పంచ్ తొలేం సావిత్రి, మండల మహిళా నాయకురాలు పూణెం శ్యాం కుమారి, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….