ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  కరకగూడెంలో వానాకాలం నాట్లు నిదానంగా

కరకగూడెంలో వానాకాలం నాట్లు నిదానంగా

కరకగూడెం, జూలై 21 (ఆధాబ్ న్యూస్)

: కరకగూడెం మండలంలో వానాకాలం సాగు పనులు ఈ ఏడాది నిదానంగా కొనసాగుతున్నాయి. గత సంవత్సరం ఇదే సమయానికి మండలవ్యాప్తంగా సుమారు 10,321 ఎకరాల్లో సాగు జరగగా, ప్రస్తుతం కేవలం 1,250 ఎకరాల్లో మాత్రమే నాట్లు పూర్తైనట్లు సమాచారం.

వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం, ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు రావడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణంగా వానాకాలం ప్రారంభంలో వేగంగా సాగాల్సిన నాట్ల ప్రక్రియ, ఈసారి నీటి లభ్యత తగ్గడంతో ఆలస్యమవుతోందని రైతులు చెబుతున్నారు.

పొలాల్లో నీరు నిల్వ ఉండకపోవడం, చెరువులు మరియు ఇతర నీటి వనరుల్లో సరిపడా నీరు లేకపోవడం వల్ల అనేక మంది రైతులు నాట్లను వాయిదా వేస్తున్నారు. ఇప్పటికే నారుమడులు సిద్ధం చేసుకున్న రైతులు కూడా వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.

రాబోయే రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిస్తేనే సాగు పనులు ఊపందుకుంటాయని, రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి తగ్గుతుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. వర్షాల పరిస్థితిని బట్టి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుని, వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని అధికారులు సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….