ప్రతి క్షణం
ప్రజల పక్షం

అమరవీరుల త్యాగాలే పోలీస్ శాఖకు స్ఫూర్తి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఘన నివాళులు అర్పించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఎల్‌నినో ఎఫెక్ట్.. పేదలకు ‘అమ్మహస్తం’ తరహా రేషన్? నిత్యావసరాల సబ్సిడీ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో

  ఖమ్మం జిల్లా దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలకు విద్యా సామగ్రి పంపిణీ

 

ఖమ్మం జిల్లా దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలకు విద్యా సామగ్రి పంపిణీ

కరకగూడెం, జూలై 20 (ఆధాబ్ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చిలకలగుంపు మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొత్తూరు పాఠశాలల విద్యార్థులకు ఖమ్మం జిల్లాకు చెందిన దాతలు ఆయుర్వేద వైద్యులు డా. కాళహస్తి వెంకటేశ్వరరావు, ఎన్‌ఆర్‌ఐ (అమెరికా) శ్రీ వి.వి. యేసు రెడ్డి, కె. సూర్యనారాయణ, బి. బావ సింగ్ సంయుక్తంగా నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఒక సౌండ్ బాక్స్‌ను విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి మంజుల, అనంతారం కాంప్లెక్స్ హెచ్‌ఎం సీహెచ్. వసంతరావు, చిలకలగుంపు, కొత్తూరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ సీఆర్‌పీ విష్ణు, వై. సర్వేశ్వరరావు, కె. సూర్యనారాయణ, బి. బావ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

మండల విద్యాశాఖ అధికారి మంజుల మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములైన ఖమ్మం జిల్లా దాతలకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు