ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  భద్రాచలంలో పోలీసుల కార్డాన్ అండ్ సెర్చ్ 39 వాహనాల స్వాధీనం

భద్రాచలంలో పోలీసుల కార్డాన్ అండ్ సెర్చ్
39 వాహనాల స్వాధీనం

భద్రాచలం, జూన్ 6 (ఆధాబ్ న్యూస్): జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవెన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 37 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం కాలనీవాసులతో సమావేశమైన డీఎస్పీ అరుణ్ కుమార్ పలు సూచనలు చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలని తెలిపారు. నేరాల నియంత్రణ కోసం నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

మహిళలు, పిల్లల భద్రతపై ప్రత్యేకంగా అవగాహన కల్పించిన ఆయన, ప్రజలు తమ ప్రాంత సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100కు ఫోన్ చేసి పోలీసు సేవలను పొందవచ్చని తెలిపారు.

ఈ కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో సుమారు 90 మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ అరుణ్ కుమార్, ఇన్‌స్పెక్టర్ నాగరాజు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, సీఆర్పీఎఫ్ సిబ్బంది, ట్రాఫిక్, స్టేషన్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, నార్కోటిక్స్ స్నిఫర్ డాగ్ బృందం పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….