ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  జానంపేటలోనే 108 అంబులెన్స్ కొనసాగించాలి

జానంపేటలోనే 108 అంబులెన్స్ కొనసాగించాలి

సీపీఐ మండల కార్యదర్శి తోగటి కుమార్ డిమాండ్

పినపాక, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పరిధిలో పనిచేస్తున్న 108 అంబులెన్స్ వాహనాన్ని మణుగూరుకు తరలించడంపై సీపీఐ మండల కార్యదర్శి తోగటి కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (DM&HO)కు వినతిపత్రం సమర్పించారు.

జానంపేట పరిధిలోని పలు గ్రామాలు, గిరిజన ప్రాంతాలు ప్రధాన పట్టణాలకు దూరంగా ఉండటంతో అత్యవసర సమయాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా గర్భిణీలు, ప్రమాద బాధితులు, అడవి గూడెల ప్రజలకు 108 సేవలు అత్యంత అవసరమని పేర్కొన్నారు.

మణుగూరు నుండి 108 అంబులెన్స్ రావడానికి గంటల సమయం పడుతుండటంతో ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఈ ప్రాంత ప్రజల్లో అధికంగా పేద, గిరిజన కుటుంబాలు నివసిస్తున్నందున ప్రైవేట్ వాహనాలకు వేల రూపాయలు ఖర్చు చేసే స్థోమత లేదన్నారు.

కావున మణుగూరుకు తరలించిన 108 అంబులెన్స్ వాహనాన్ని తిరిగి జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే శాశ్వతంగా అందుబాటులో ఉంచాలని తోగటి కుమార్ డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….