ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం – తాటిగూడెం మైదానంలో పోటీలకు శ్రీకారం చుట్టిన ఎమ్మార్వో కాంతయ్య

మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం
– తాటిగూడెం మైదానంలో పోటీలకు శ్రీకారం చుట్టిన ఎమ్మార్వో కాంతయ్య
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని తాటిగూడెం క్రీడా మైదానంలో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను ఎమ్మార్వో కాంతయ్య ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడల ద్వారా యువతలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెంపొందుతాయని పేర్కొన్నారు.

మండల స్థాయిలో జరిగిన పోటీల్లో సీనియర్ విభాగం వాలీబాల్‌లో సమత్ మోతె క్లస్టర్ మొదటి బహుమతిని గెలుచుకోగా, జూనియర్ విభాగం వాలీబాల్‌లో చిరుమల్ల క్లస్టర్ విజేతగా నిలిచింది. కబడ్డీ విభాగంలో చిరుమల్ల క్లస్టర్ విజయం సాధించగా, కోకో విభాగంలో కరకగూడెం ఆశ్రమ పాఠశాల విద్యార్థులు గెలుపొందారు.

విజేతలకు ఎమ్మార్వో కాంతయ్య బహుమతులు అందజేశారు. క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అసెంబ్లీ స్థాయి పోటీలకు పంపిస్తామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ గడ్డం మంజుల, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, సెక్రటరీలు, క్లస్టర్ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….