ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  పూనుగండ్ల నుంచి మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు

పూనుగండ్ల నుంచి మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు పడగ

గోవిందరావుపేట,ఆధాబ్ న్యూస్:
మహబూబాబాద్ జిల్లా గంగారం మండల పరిధిలోని సమ్మక్క భర్త పూనుగండ్ల గ్రామం నుంచి పగిడిద్దరాజు పడగ మంగళవారం మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు బయలుదేరింది. సుమారు 50 కిలోమీటర్ల అరణ్య మార్గం గుండా నాలుగో గోట్టు అర్రెం వంశీయుల ఆధ్వర్యంలో పగిడిద్దరాజు పడగను తీసుకువచ్చారు.

మంగళవారం రాత్రి గోవిందరావుపేట మండల పరిధిలోని లక్షింపురం గ్రామంలో పగిడిద్దరాజు పడగకు విడిది ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం అక్కడి నుంచి పగిడిద్దరాజు పడగ మళ్లీ బయలుదేరి, సాయంత్రం నాటికి మేడారంలోని పగిడిద్దరాజు గద్దెపై ఆసీనులు కానుంది.

లక్షింపురంలో పగిడిద్దరాజు పడగ రాక సందర్భంగా పూజారులు పెనక రాజేశ్వర్, పెనక సురేందర్, పెనక వెంకటేశ్వర్లు, పెనక సారయ్య, పెనక సత్యనారాయణ, పెనక సమ్మయ్య, పెనక యుద్దయ్య, పెనక కృష్ణయ్య, పెనక నరేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జుమ్మి లాల్, ఉపసర్పంచ్ ఎట్టి వెంకటేష్‌తో పాటు గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘన స్వాగతం పలికారు.

సమ్మక్క–సారలమ్మ జాతర నేపథ్యంలో పగిడిద్దరాజు పడగ ప్రయాణం ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకగా కొనసాగుతుందని భక్తులు పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….