ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  ఏజెన్సీలో ఆణిముత్యం – నేషనల్ స్థాయికి ఎంపికైన బాలకృష్ణ

ఏజెన్సీలో ఆణిముత్యం – నేషనల్ స్థాయికి ఎంపికైన బాలకృష్ణ

కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన తోలేం బాలకృష్ణ ST ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీసా క్రీడల్లో ప్రతిభ కనబరిచి నేషనల్ స్థాయికి ఎంపిక కావడం విశేషం. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన క్రీడాకారుడిగా బాలకృష్ణ సాధించిన ఈ ఘనత స్థానికంగా గర్వకారణంగా మారింది.

14-12-2025 తేదీన మోడల్ స్పోర్ట్స్ స్కూల్, కిన్నరసానిలో ఏర్పాటు చేసిన క్రీడా శిక్షణా శిబిరంలో బాలకృష్ణ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. గతంలో కూడా జాతీయ స్థాయి సీనియర్ కబడ్డీ పోటీలకు మూడు సార్లు లీగ్ దశలో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నాడు.

ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ కబడ్డీపై ప్రత్యేక మక్కువతో నిరంతరం సాధన చేస్తూ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిల్లో ఆడి రాష్ట్రానికి, మండలానికి మంచి పేరు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. బాలకృష్ణ సాధించిన విజయంపై కరకగూడెం మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, “నాకు తగిన సహాయ సహకారాలు అందిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే దృఢ సంకల్పంతో ఉన్నాను” అని తెలిపారు. తనకు సహకారం అందించిన ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్‌తో పాటు క్రీడాకారులకు సమన్వయం చేసిన క్యాంపు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలతో మీ ముందుకు వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….