ప్రతి క్షణం
ప్రజల పక్షం

  బీసీ రిజర్వేషన్లపై సుప్రీం సంచలన తీర్పు – తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం సంచలన తీర్పు – తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: తెలంగాణ బీసీ రిజర్వేషన్లపై కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. కేసు ఇప్పటికే హైకోర్టులో విచారణలో ఉండగా, సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది.

జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా బెంచ్ తీర్పు ఇచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన జీవో 9ను సవాలు చేస్తూ వంగ గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది.

విచారణకు తెలంగాణ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి స్వయంగా హాజరయ్యారు. సుప్రీం తీర్పుతో బీసీ రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్