ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  భద్రాద్రి కొత్తగూడెంలో ఫేక్ అటెండెన్స్ కలకలం పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు

భద్రాద్రి కొత్తగూడెంలో ఫేక్ అటెండెన్స్ కలకలం

పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు పంచాయతీలకు చెందిన కార్యదర్శులు విధులకు హాజరైనట్లు తప్పుడు హాజరు (ఫేక్ అటెండెన్స్) నమోదు చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా గుర్తించిన జిల్లా కలెక్టర్ (పబ్లిక్ వర్క్స్) కార్యాలయం సంబంధిత కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఈ నెల 1వ తేదీన విడుదలైన అధికార నోటీసులో, e-పంచాయతీ పోర్టల్లో నమోదైన రోజువారీ హాజరు వివరాలు, PS App ద్వారా అప్‌లోడ్ చేసిన డేటాను పరిశీలించగా… పలు మండలాలకు చెందిన కార్యదర్శులు విధులకు హాజరుకాకుండా డేటాలో హాజరైనట్లుగా నమోదు చేసినట్టు వెల్లడైంది.

ఈ తప్పుడు హాజరు అంశంపై జిల్లా కలెక్టర్ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. “దీనిని తీవ్ర నిర్లక్ష్యంగా పరిగణిస్తూ, సంబంధిత కార్యదర్శులు మూడురోజుల్లోగా వివరణ ఇవ్వాలి. లేదంటే చర్యలు తప్పవు,” అని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు.

నోటీసులో వివరణ ఇచ్చిన ఆధారాలు ఇలా ఉన్నాయి:

పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి డైరెక్టర్ నుంచి వచ్చిన వాట్సాప్ సందేశాలు (తేదీ: 30.07.2025)

ఉన్నతాధికారుల నుండి టెలిఫోనిక్ సూచనలు

జూలై 31వ తేదీన e-పంచాయతీ పోర్టల్ నుంచి సేకరించిన హాజరు నివేదిక

ఈ వివరాలన్నింటి ఆధారంగా నిర్ధారించబడిన ‘ఫేక్ అటెండెన్స్’కు సంబంధించిన కార్యదర్శుల జాబితాను ‘ రూపంలో జతచేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మండల స్థాయి పంచాయతీ అధికారులకు కూడా సమాచారం పంపించినట్లు పేర్కొన్నారు.

ఈ షోకాజ్ నోటీసు TG CC&A రూల్స్, 1991 ప్రకారం తీసుకున్న తొలి చర్యగా భావించవచ్చు. సంబంధిత కార్యదర్శులు సమాధానం ఇవ్వకపోతే తదుపరి క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

ఇది గుణపాఠం కావాలి:
ఈ ఘటన జిల్లాలోని ఇతర పంచాయతీ ఉద్యోగులకు హెచ్చరికగా మారింది. బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే అధికారికంగా ఎలా చర్యలు తీసుకుంటారో ఈ ఘటన స్పష్టం చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….