ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తీస్తుండగా విషాదం యమునా నదిలో మునిగి ఆరుగురు అక్కాచెల్లెళ్లు మృతి

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తీస్తుండగా విషాదం

యమునా నదిలో మునిగి ఆరుగురు అక్కాచెల్లెళ్లు మృతి

ఉత్తరప్రదేశ్,ఆధాబ్ న్యూస్:
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తీస్తుండగా జరిగిన విషాద ఘటనలో ఆరుగురు యువతులు యమునా నదిలో మునిగి మృతిచెందారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలోని నగ్లా స్వామి గ్రామంలో చోటుచేసుకుంది.

స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు యమునా నది వద్ద reels వీడియో తీయడానికి వెళ్లారు. నది వారి ఇళ్లకు సుమారు 800 మీటర్ల దూరంలో ఉంది. వీడియో తీస్తున్న సమయంలో వారు ఒకరి చెయ్యి మరొకరు పట్టుకుని నదిలోకి దిగారు. ఈ క్రమంలో ఓ యువతి ప్రమాదవశాత్తూ లోతుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లింది. ఆమె నీటిలో మునిగిపోతూ ఉండగా, మిగిలిన వారు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, వారు కూడా నీటిలో కొట్టుకుపోయారు.

సమీపంలో ఉన్న ఇద్దరు యువకులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు తర్వాత సంఘటన చోటు చేసుకున్న స్థలానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఆరుగురిని కనుగొన్నారు.

వారిలో నలుగురు అప్పటికే మృతి చెందగా, మిగిలిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ ఇచ్చి ప్రాణాల కోసం ప్రయత్నించినప్పటికీ, కొన్ని గంటల తర్వాత వారు కూడా మృతి చెందారు.

మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు. మరణించిన వారిలో ముస్కాన్ అనే యువతికి ఇటీవలే నిశ్చితార్థం కాగా, నవంబరులో పెళ్లి ఉండాల్సి ఉంది. ఈ ఘటనతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయిందని

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….